
కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంపిలోని శ్రీ నృహరి తీర్థుల బృందావనంలో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఆరాధన ఉండడంతో మంగళ వారం రాత్రి మంత్రాయం నుంచి వాహనంలో డ్రైవర్‌తో సహా 14 మంది బయలుదేరారు. కర్ణాటకలోని రాయచూరు ఏర్పాటు సింధనూర్ తాలూకా సమీపంలో వాహనం టైర్ పేలీ పల్టీలు కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంత్రాలయం సంస్కృత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అయవందనన్ (18), సుజేంద్ర (22), అభిలాష్ (20), డ్రైవర్ శివ (24) అక్కడికక్కడే మృతి చెందారు.
5,954 Views