[ad_1]

- ఈనెల 30 వరకు కొనసాగనున్న రెడ్ అలర్ట్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా రాష్ట్ర పోలీసులు, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎయిర్పోర్ట్కు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు.. అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తున్నాయి.
The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ appeared first on Mudra News.
[ad_2]