
ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని కేసులు బనాయించినా యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలకు ప్రయత్నించినా పసుపు సైనికులు ఎక్కడా సంయమనం కోల్పోయారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో యువగళం వాలంటీర్లపై కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితోసహా 46మంది కీలకనాయకులపై కేసులు నమోదు చేశారు.
5,954 Views