
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 12.03.2025:ఎస్సీ వర్గీకరణ చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియమాకాలు ఆపివేయాలి. మాదిగ విద్యార్థులకు అన్యాయం చేయవద్దు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మాదిగల్లో రాష్ట్ర ప్రభుత్వం పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత అదే జరిగితే రేవంత్ రెడ్డి సర్కారుకు రాజకీయ పరాభవం తప్పదు. అని మహా జన సోషలిస్ట్ పార్టీ (MSP) ఉమ్మడి నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మరియు ఎలాంటి
ఉద్యోగ నియమాకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ లో బాగంగా బుధవార నాడు తిరుమలగిరి మండల కేంద్రంలోని తహసిల్దారి కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష కార్యక్రమాన్ని 2వ రోజు కొనసాగించారు. ఈ దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్పి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పట్ల రేవంత్ రెడ్డి సర్కారుకు సరైన చిత్తశుద్ధి లేదని వర్గీకరణ చేపట్టకుండానే అసెంబ్లీలో చట్ట రూపం దాల్చకుండానే ఆగమేఘాల మీద ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ఫలితాలను నియమాకాలను చేపట్టి మాదిగ మాదిగ ఉపకులాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని వర్గీకరణ చేపట్టకుండా ఎలాంటి ఉద్యోగ నియమాకాలు చేపట్టవద్దని తెలిపారు. కానీ అదే జరిగితే మాదిగ మాదిగ ఉపకులల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతుందని అది ప్రజా అగ్రహంగా మారి రాబోయే రోజుల్లో ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను మాదిగ. డప్పు కళాకారుల సంఘం తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు కందుకూరి రవి మాదిగ, బోడ సోమయ్య, బోడ బిక్షపతి, పత్తేపురం ప్రభాకర్, పత్తేపురం వెంకన్న, పోతరాజు ప్రవీణ్, కందుకూరి సోమేశ్వర్, కందుకూరి మహేష్, ఎర్రబెల్లి శ్రీను, బోడ అనిల్, పెండేల గణేష్, బోడ చరణ్, పేరాల జగన్ తదితరులు పాల్గొన్నారు.