
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 16.03.2025: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసం (వైట్ హౌస్) లో నూతనంగా నియమితులైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో ఆదివారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ యూత్ కాంగ్రేస్ మాజీ అధ్యక్షులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, సూర్యాపేట జిల్లా మాజీ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు బైరు శైలేందర్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గోరెంట్ల సంజీవ, సూర్యాపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు లింగస్వామి నెల్లుట్ల, పిడమర్తి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

5,929 Views