
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 17.03.2025: ప్రభుత్వం చేతగాని, చేవలేని పని తనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుందని అందులో భాగంగా ఈ నెల 20న నిర్వహించే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని విజయవంతం చేకుంటూ ఏప్రిల్ 27న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపు నిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించాడంటే ఆ వీడియోలు చూస్తే ఎక్కడ అలా లేదని అయినా దాన్ని సాకుగా చూపి దళిత స్పీకర్ ను అంటారా అని అంటున్నారని పదే పదే స్పీకర్ను దళిత స్పీకర్ అంటూ మీరే అవమానిస్తున్నారని ఓ పదవి వచ్చిన తరువాత కూడా స్పీకర్ను స్పీకర్గా గుర్తించకుండా దళిత స్పీకర్ అంటున్న కాంగ్రెస్ నాయకులు మాటలు మార్చుకోవాలన్నారు. జగదీష్ రెడ్డి ఎక్కడ తప్పు మాట్లాడలేదని అయినా జగదీష్ రెడ్డి ని బయటకు పంపించారని జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే మీ ఆటలు సాగడం లేదని అందుకు బహిష్కరిస్తామని అప్రజాస్వామికంగా చీకటిరోజును తలపించేలా జగదీష్ రెడ్డి ని బయటకు పంపారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మహిళా జర్నలిస్టు అయినా సరే ఏ జర్నలిస్టు అయినా యూట్యూబ్, సోషల్ మీడియావాళ్ళు ఇష్టామొచ్చినట్లు మాట్లాడుతున్నారనీ తోలు తీస్తా, బట్టలూడదీసి కొడుతా అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మెంటల్ లేచిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ భాష మాట్లాడితే ఒక్క మేధావి, ఒక్క జర్నలిస్టు మాట్లాడడం లేదని స్పీకర్ రికార్డుల్లో నుంచి తొలగించాల్సింది పోయి నవ్వుకుంటూ కూర్చున్నాడన్నారు. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకొనే అంటూ అంతకు ముందు నువ్వు మాట్లాడినప్పుడే ఏమైందని, ఈ రోజు నీ కుటుంబాన్ని అంటే బాధ అయితే ఆ రోజు నువ్వు అన్నప్పుడు ఆ కుటుంబాలు బాదపడలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టావో వారు బాధ కొద్ది మాట్లాడని అర్ధం చేసుకొని ప్రజలకు మంచి చేయాలన్నారు. బడ్జెట్లో పెట్టడానికి డబ్బులు లేవనీ, చెప్పిన హామీలు అమలు చేస్తానికి చేతకాదనీ, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదనీ, ఇక డీఏల సంగటి చుద్దామనీ, వాటి నుంచి పక్కదారి పట్టాలంటే కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిలను ఏదో ఒకటి అని పక్కదారి పట్టించే చేతగాని వాడు చేసే
రాజకీయమీదన్నారు. తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఢిల్లీ వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి కనపడ్డాని కాళ్ళు మొక్కి 14 యేళ్ళు ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ స్ట్రేచర్ మీదకు పోయిండు అని, మార్చురీకొ పోతడని ఆయన చావు కోరుకుంటావా అని ప్రశ్నించారు. ఇదేమని అడిగితే తాను పార్టీని తిట్టినా కేసీఆర్ ను అనలేదని 24 గంటల్లో 24 అబద్దాలు మాటలు మాట్లాడుతున్న ఇంత అబద్దాలోడిని నేను చూడలేదన్నారు. నాడు తెలంగాణాకు వ్యతిరేకంగా చంద్రబాబు సంకన చేరి స్టీఫెన్ కు 50 లక్షల మూటను ఇచ్చి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు నువ్వు నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేదన్నారు. నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక్క మాట సరిగా లేదని పొద్దుగాల లేస్తే కేసీఆర్ జపం తప్పితే నీకు బతుకు లేదన్నారు. ప్రజాక్షేత్రంలోకి మేము వచ్చాక ఓటు ద్వారా ప్రజలు బట్టలూడదీసి కొడుతారని నోరుకు ఏది వస్తే అడి మాట్లాడకుండా ఓళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాలు ఎండిపోతున్నాయని స్విచ్ వేస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం, సుందిళ్ళ, యల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ దాటుకొని నీళ్ళు వస్తాయని కానీ ఇస్తలేరని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, సమీక్షలు పెట్టడనీ, తెలవకుంటే తెలుసుకోడని పొలాలు ఎండిపోతున్నాయని, కన్నెపల్లి పంప్ హౌజ్లో రెడీగా ఉన్నాయనీ, ఇవ్వమంటే చాత కాదు కానీ దేవాదుల నుంచి తీసుకొస్తానంటున్నాడని, అది ఏదైనా సరే నీళ్ళు ఇవ్వమని వేడుకుంటున్నామన్నారు. బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు ఏమీ పెట్టడు అది సాధ్యం కాదని వాటి నుంచి తప్పించుకునేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటికి ఎంతో చరిత్ర ఉందని ఎన్నో ఉద్యమాలు జరిగాయని ఇవాళ ఉస్మానియా యూనివర్శిటిలో ఎలాంటి దర్నాలు, రాస్తారోకోలు చేయవద్దని డిసైడ్ చేస్తావా ప్రజాపాలన అన్న నీకు ఎందుకు భయమైందుకైతుందన్నారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు అందరికి ఉంటుందని ఉస్మానియా యూనివర్శిటి వేదికని దాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. ఉస్మానియా లో ఉద్యమం చేస్తే కేసులు పెడుతామంటే భయపడమని, ప్రజలంతా గమనించాలని ఎన్నికల ముందు ఏం మాట్లాడరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చంద్రబాబుకు చెంచాలా పని చేసున్న ముఖ్య మంతికి తగిన బుద్ధి చెప్పాలని విజపి చేశారు.

ఈ నెల 20న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే బీఆర్ఎస్ ముక్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ జిల్లా ముక్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ రాస్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని అలాగే మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ గ్రామం నుంచి ముఖ్య నాయకులు హాజరు కావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం పై చర్చించడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అవి అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఇచ్చిన హామీలు మరిచి నామ మాత్రంగా పథకాలు అమలు చేసి అన్ని పథకాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయంకు సంబంధించి నీటిని ఇచ్చేందుకు ప్రాజెక్టుల్లో నీరు ఉన్నాయని అధికారులు చెబుతున్నా కాలువల్లో రైతులకు నీళ్ళు రావడం లేదన్నారు. వారబంది ప్రకారం నీళ్ళు ఇస్తామంటే నమ్మి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే ఆ రైతులు రోడ్డుపాలై నీళ్ళు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ సెన్యం వెంట పడుతుందన్నారు. అందులో భాగంగానే వరంగల్లో జరిగే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఈనెల 20న నిర్వహించే కేటీఆర్ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, దావుల వీరప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జెడ్పిటిసి జీడి బిక్షం, తూడి నరసింహారావు తదితరులు ఉన్నారు.