
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 18.03.2025: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఎల్సొజు చామంతి నరేష్ ని మంగళవారం కమిటీ కార్యాలయంలో ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాసంపల్లి మోహన్ ఆధ్వర్యంలో వారిని పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు బన్వరి నర్సయ్య, తిరుమలగిరి గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బాష్పాల మధు, భూతాల రాంబాబు, శంకర్, మహేష్, నర్సింహా స్వామి, బాషి, దునుకునాల నర్సింహా స్వామి సావాని సోమేశ్, భక్తపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
5,953 Views