
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 20.03.2025: తిరుమలగిరి మండలంలో శుక్రవారం నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని మండల విద్యాధికారి శాంతయ్య తెలిపారు. జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి(240) మంది విద్యార్థులు, ఫాతిమా హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం (198) మంది విద్యార్థులు, కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం లో(185) మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఈ మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తము (623) మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తేదీ 21 నుండి 04 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షకు గంట ముందు అనగా ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యాధికారి శాంతయ్య తెలిపారు. గురువారం 20తేది న పరీక్ష కేంద్రంలో పనిచేసే ఇన్విజిలేటర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం విద్యాధికారి శాంతయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని సెంటర్ల సిఎస్, డివోలు దామెర శ్రీనివాస్, జి శ్రావణ్ కుమార్, జడ్.పి.హెచ్.ఎస్ తిరుమలగిరి, ఫాతిమా స్కూల్, సిఎస్. బత్తిని విష్ణుమూర్తి, డివో. బురహనోద్దీన్, సిఎస్. ఎం. శ్రీనివాస్ డివో. డి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.