
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 26.03.2025: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతారం మోడల్ స్కూల్ లో సైబర్ నేరాలపైన, ఆన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తు మందులపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఎస్సై నికోలస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి కె నరసింహ ఆధ్వర్యం లో సైబర్ నేరాలపై, ఆన్ లైన్ బెట్టింగ్స్,గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దని, బ్యాంక్ ఖాతా ఏటిఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దని కోరారు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలిపారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని, వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అనంతారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న గౌడ్, కానిస్టేబుల్ హరిబాబు, సైదులు, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, గోపయ్య, ఈశ్వర చారి, కృష్ణ నాగార్జున, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి టౌన్ వార్తల కవరేజి కి క్రింది నెంబర్ ను సంప్రదించండి:8074884972