50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు ‘ఊర్వశి’ శారద. అందులో 125 సినిమాలు మలయాళంలోనే చెయ్యడం విశేషం. అందుకే కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జె.సి.డెనియల్ అవార్డుకు 2024కిగాను శారదను ఎంపిక చేశారు. ఈ అవార్డులో భాగంగా రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు శారద.
[1945జూన్25నగుంటూరుజిల్లాతెనాలిలోవెంకటేశ్వర్లుసత్యవతిదంపతులకుజన్మించారుశారదఆమెఅసలుపేరుసరస్వతి1955లోవచ్చినకన్యాశుల్కంతోబాలనటిగాకెరీర్‌ప్రారంభించినశారదచాలాతక్కువసమయంలోనేనటిగామంచిపేరుతెచ్చుకున్నారుముఖ్యంగాభావోద్వేగంతోసాగేపాత్రలుసామాజికసమస్యలపైరూపొందించినబలమైనపాత్రలతోప్రేక్షకులనుకట్టిపడేశారుఉత్తమనటిగాజాతీయఅవార్డులుఅందుకోవడంలోనూఅరుదైనగౌరవాన్నిదక్కించుకున్నారుశారద’తులాభారం'(1968)’స్వయంవరం'(1972)’నిమజ్జనం'(1977)ఇలామూడుసినిమాల్లోప్రదర్శించినఅద్వితీయమైననటనకుమూడుసార్లుఉత్తమనటిగాఅవార్డులువచ్చాయిఆరోజుల్లోఉత్తమనటికిఇచ్చేఅవార్డునుఊర్వశిపేరుతోపిలిచేవారుఅలాశారదపేరుముందుఊర్వశిఇంటిపేరుగాచేరింది
సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు శారద. 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగంలోనూ సేవలందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులు పదికాలాలపాటు గుర్తుంచుకోదగిన పాత్రలు చేశారు ఊర్వశి శారద.




