
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట రూరల్, 15.03.2025: శాసనసభ సమావేశాలలో భాగంగా గురువారం రోజున జరిగిన అసెంబ్లీ లో ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలిచి ప్రశ్నలు అడిగి, పాలక పక్షానికి ముచ్చెమటలు పట్టించిన విషయాన్ని జీర్ణించుకోలేక మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పై కక్షపూరితంగానే చేసిన సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో శనివారం చింతలపాటి మధు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి దుష్టిబొమ్మ దగ్దం చేశారు. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో గౌండ్ల నరసింహ, బొడ్డు కిరణ్, కొమ్ము నాగరాజు, పిట్టల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

5,935 Views