
*సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి…
*సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం…
*ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు…
*మహిళల పట్ల మర్యాదగా ఉండాలన్న సూర్యాపేట జిల్లా ఎస్పి కె.నరసింహ…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట, 13.03.2025: హోళీ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పి కె. నరసింహా ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ ఉత్సవం జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలని ఒక ప్రకటనలో ఎస్పీ కోరారు. యువత ఆదర్శంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దు, సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని ఎస్పి తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలి, సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దని కోరినారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పి విజ్ఞప్తి చేసినారు. సిసి కెమెరాల నిఘా ఉన్నది, వాహనాల తనిఖీలు నిర్వహిస్తాం, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు అని ఎస్పి తెలిపినారు.
