[ad_1]

విభిన్న చిత్రాల కథానాయకుడు ధనుష్(ధనుష్)నిన్న ‘కర'(కర)మూవీతో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ ని కబ్జా చెయ్యడానికి వచ్చాడు. హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ధనుష్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా భైజు కనిపించింది. మొదటి ఆట నుంచే అన్ని చోట్లా మిక్స్డ్ టాక్ రన్ అవుతుండటం ధనుష్ అభిమానులను కలవరపరుస్తుంది. మరి ఈ మూవీ నిన్న రాబట్టిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
కర తొలి రోజు వరల్డ్ వైడ్ గా 9 .14 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ లో తమిళనాడు గ్రాస్ 4 .75 కోట్లు, తెలుగు రాష్ట్రాల గ్రాస్ 1 .65 కోట్లు, కర్ణాటక 60 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై లక్షలు, ఓవర్ సీస్ 2 .50 కోట్లు. ఇలా మొత్తం 9.14 కోట్ల గ్రాస్ ని కలిగి ఉంది. ఇండియా వైడ్ గా చూసుకుంటే 7 .20 కోట్ల గ్రాస్. ఎంటైర్ ధనుష్ కెరీర్ లోనే లోయస్ట్ ఫిగర్. అందుకే ధనుష్ అభిమానులు కలవర పడుతున్నారు.
ఇది కూడా చదవండి: jetlee: జెట్లీ హైలెట్స్ ఇవేనంట… నిజమో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుగా
అసలు బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గరనుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘కర’ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తెలుగుతో పాటు ఓన్ ఏరియా తమిళనాడులోను అదే పరిస్థితి. దాదాపు 25 శాతం ఆక్యుపెన్సీ నే తమిళనాట నమోదయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా పదేళ్ల క్రితమే కలెక్షన్స్ సాధించిన ధనుష్ కి ఇలాంటి పరిస్థితి అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా మిగిలింది. బహుశా అభిమానులు ఆ రహస్యాన్ని ఛేదించే పనిలో ఉంటారు . విగ్నేష్ రాజా(విఘ్నేష్ రాజా)దర్శకత్వంలో ‘ఈషారీ కే గణేష్’ నిర్మించగా జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.
[ad_2]


